MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
MBBS Student | ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని బెగరాజ్పూర్ మెడికల్ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని శగున్ సైనీ సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.
MBBS Student | ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని బెగరాజ్పూర్ మెడికల్ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థిని శగున్ సైనీ సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల హాస్టల్లోని గదిలో ఆమె మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో కంగారుపడిన తోటి విద్యార్థులు, సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ముజఫర్‌నగర్ జిల్లా మన్సూర్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెగరాజ్పూర్ మెడికల్ కళాశాల హాస్టల్లో ఈ ఘటన జరిగింది. శగున్ గది తలుపు లోపలి నుంచి మూసి ఉండటంతో పాటు ఎంత పిలిచినా డోర్ తీయకపోవడంతో తోటి విద్యార్థులు, భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. వెనుకవైపు కిటికీలో నుంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గది తలుపును తెరిచి మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
శగున్ తరచూ ఫోన్లో ఓ ఫ్రెండ్‌తో గొడవపడేదని ఆమె రూంమేట్ పోలీసులకు తెలిపింది. ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
Tirumala Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో సిఫార్సు లేఖలు బంద్!
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

