Mayawati Expels Nephew | మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను.. బీఎస్పీ నుంచి బహిష్కరించిన మాయావతి
Mayawati Expels Nephew | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయ వారసుడిగా ప్రచారం జరిగిన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయ వారసుడిగా ప్రచారం జరిగిన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. (Mayawati Expels Nephew) పార్టీలోని అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించిన మరునాడే ఈ మేరకు వేటు వేశారు. పార్టీ షోకాజ్ నోటీసుకు ఆకాష్ ఆనంద్ ప్రతిస్పందన ‘స్వార్థపూరితమైనది, అహంకారపూరితమైనది’ అని ఆమె విమర్శించారు.
కాగా, బీఎస్పీ నుంచి ఇప్పటికే బహిష్కరించిన మామ అశోక్ సిద్ధార్థ్ ప్రభావంలో ఆకాష్ ఆనంద్ ఉన్నట్లుగా ఆయన సమాధానం స్పష్టం చేసిందని మాయావతి ఆరోపించారు. ‘ఆయన (ఆకాష్ ఆనంద్) దీనికి పశ్చాత్తాపపడి తన పరిణతిని ప్రదర్శించి ఉండాలి. కానీ దీనికి విరుద్ధంగా ఆకాష్ ఇచ్చిన సుదీర్ఘ ప్రతిస్పందన ఆయన పశ్చాత్తాపం, రాజకీయ పరిణతికి చెందినది కాదు. చాలా స్వార్థపరుడు, అహంకారి. తన మామకు ప్రభావితం కానివాడు కాదు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు అత్యంత గౌరవనీయులైన బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆత్మగౌరవం, ఆత్మగౌరవ ఉద్యమ ప్రయోజనాల దృష్ట్యా, కాన్షీరామ్ క్రమశిక్షణా సంప్రదాయాన్ని అనుసరించి ఆకాష్ ఆనంద్‌ను ఆయన మామ మాదిరిగానే పార్టీ నుంచి నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశంలో కూడా రెండు వర్గాలుగా బీఎస్పీని విభజించడం ద్వారా పార్టీని బలహీనపరిచే దారుణమైన కుట్రకు ఆకాష్ ఆనంద్ పాల్పడినట్లు ఇటీవల మాయావతి ఆరోపించారు. ఇది పూర్తిగా సహించరానిదని అన్నారు. ఆదివారం జరిగిన బీఎస్సీ సమావేశంలో పార్టీలోని అన్ని పదవుల నుంచి ఆకాష్ ఆనంద్‌ను తొలగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Akash Anand
- BSP
- expels
- Mayawati
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

