Poonch Attack: డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లతో ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్
Poonch Attack: డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్‌తో పూంచ్‌లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆర్మీ వాహనంపై నిన్న ఉగ్రవాదులు గ్రేనేడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో అయిదుగురు జవాన్లు మృతిచెందారు.
జమ్మూ: జమ్మూకశ్మర్‌లో పూంచ్(Poonch) జిల్లాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు గ్రేనేడ్ దాడి చేసిన ఘటనలో అయిదుగురు జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే బాట-దోరియా ప్రాంతంలో ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు మొదలైంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం చట్టుముట్టేశారు. డ్రోన్లు, స్నిఫర్ శునకాల ద్వారా ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. అదే ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదుల్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
రాజౌరి, పూంచ్ బోర్డర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గురువారం ఆర్మీ వాహనంపై అటాక్ జరిగిన తర్వాత భింబేర్ గలీ-పూంచ్ రోడ్డపై ట్రాఫిక్‌ను ఆపేశారు. పూంచ్‌కు వెళ్లేవాళ్లు మెందార్ రూట్లో వెళ్లాలని సూచించారు. కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ కోసం విధుల్లో ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్ బృంద సైనికులే ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
మృతిచెందిన జాబితాల్లో హవల్దార్ మణ్‌దీప్ సింగ్, లాన్స్ నాయక్ దేబశిశ్ భస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికిషన్ సింగ్, సిపాయి సేవక్ సింగ్‌లు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

