Maoist Sujatha | మావోయిస్టు కీలకనేత సుజాత అరెస్ట్.. కోటికిపైగా రివార్డు
వరుస ఎన్కౌంటర్లతో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాతను (Maoist Sujatha) పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.
ఖమ్మం: వరుస ఎన్కౌంటర్లతో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాతను (Maoist Sujatha) పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేసిన ఆమెపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో రూ.కోటికిపైగా రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, సుజాత బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్చార్జ్గా ఉన్నారు. సుక్మా ప్రాంతంలో జరిగిన అనేక ఘటనల్లో ఆమె మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. చికిత్స నిమిత్తం కొత్తగూడెంలోని దవాఖానకు వెళ్తుండగా ఆమెను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అక్టోబర్ 4న ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. వారిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమయ్యారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో డీఆర్జీ, సీఆర్పీఎఫ్-కోబ్రా, ఎస్టీవో బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండూర్-తులతులీ గ్రామల మధ్య గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. మృతులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 6వ కంపెనీ, తూర్పు బస్తర్ డివిజన్‌కి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో రూ.25 లక్షల రివార్డున్న దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, తూర్పు బస్తర్ డివిజన్ ఇన్చార్జి నీతి అలియాస్ ఊర్మిలతో పాటు డివిజినల్ కమిటీ సభ్యులు సురేశ్ సలాం, మీనా మడకం ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

