Manoj Soni: యూపీఎస్సీ చైర్మెన్‌గా మనోజ్ సోనీ ప్రమాణ స్వీకారం
Manoj Soni: మనోజ్ సోనీ ఇవాళ యూపీఎస్సీ చైర్మెన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. విద్యావేత్త సోనీ 2017, జూన్ 28వ తేదీన కమిషన్‌లో సభ్యుడిగా జాయిన్ అయ్యారు. కమిషన్‌లో సీనియర్ సభ్యులైన స్మితా నాగరాజ్ ఇవాళ మనోజ్ సోనీ చేత ప్రమాణ స్వీకారం చేయించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(యూపీఎస్సీ) చైర్మెన్‌గా మనోజ్ సోనీ(Manoj Soni) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. విద్యావేత్త సోనీ 2017, జూన్ 28వ తేదీన కమిషన్‌లో సభ్యుడిగా జాయిన్ అయ్యారు. ఇక యూపీఎస్సీ చైర్మెన్ హోదాలో ఆయన 2022, ఏప్రిల్ 5వ తేదీ నుంచి డ్యూటీ చేస్తున్నారు. కమిషన్‌లో సీనియర్ సభ్యులైన స్మితా నాగరాజ్ ఇవాళ మనోజ్ సోనీ చేత ప్రమాణ స్వీకారం చేయించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల ఎంపిక యూపీఎస్సీ ద్వారానే జరుగుతున్న విషయం తెలిసిందే. యూపీఎస్సీ కమిషన్‌లో ఒక చైర్మెన్, పది మంది సభ్యులు ఉంటారు. అయితే ప్రస్తుతం యూపీఎస్సీలో అయిదుగురు సభ్యుల వేకన్సీ ఉంది. యూపీఎస్సీకి అపాయింట్ కావడానికి ముందు ఆయన మూడు సార్లు వైస్ ఛాన్సలర్‌గా చేశారు. గుజరాత్‌లోని అంబేద్కర్ వర్సిటీ, బరోడాలోని సయ్యాజిరావు వర్సిటీలకు వీసీగా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

