మెడపట్టి గెంటేవరకూ పార్టీలోనే ఉంటా : మనీష్ తివారీ
తనను ఎవరైనా బయటకు నెట్టివేసేవరకూ తాను కాంగ్రస్ పార్టీని విడిచిపెట్టనని ఆ పార్టీ సీనియర్ నేత, జాతీయ ప్రతినిధి మనీష్ తివారీ గురువారం స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : తనను ఎవరైనా బయటకు నెట్టివేసేవరకూ తాను కాంగ్రస్ పార్టీని విడిచిపెట్టనని ఆ పార్టీ సీనియర్ నేత, జాతీయ ప్రతినిధి మనీష్ తివారీ గురువారం స్పష్టం చేశారు. కాంగ్రెస్లో తాను కిరాయిదారును కాదని, పార్టీలో భాగస్వామినని గత నాలుగు దశాబ్ధాలుగా పార్టీలో పనిచేస్తున్నానని అన్నారు.
మనీష్ తివారీ కాంగ్రెస్కు రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతున్న నేపధ్యంలో మనీష్ తివారీ తాజాగా తాను పార్టీని వీడేది లేదని ట్వీట్ చేశారు. తాను బాహాటంగా నోరుమెదిపితే తిరుగుబాటుగా పరిగణిస్తున్నారని..మౌనం దాల్చితే తాను నిస్సహాయిడిగా మిగిలిపోతానని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఇక పార్టీలో సంస్ధాగత సంస్కరణలకు జీ-23 నేతల్లో ఒకరైన మనీష్ తివారీ అంతకుముందు డిమాండ్ చేశారు.
పంజాబ్లో పంజాయత్ ఆజ్ తక్ కార్యక్రమంలో తివారీ మాట్లాడుతూ దిగువ శ్రేణి పార్టీ కార్యకర్త వైదొలగినా కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని..సీనియర్ నేత వైదొలగితే పార్టీపై అది పెనుప్రభావం చూపుతుందని అన్నారు. ఇక గత ఏడాది డిసెంబర్లో ఉత్తరాఖండ్ పార్టీలో తలెత్తిన వివాదాన్ని అసోం, పంజాబ్ రాష్ట్రాల్లో ఎదురైన సంక్షోభంతో మనీష్ తివారీ పోల్చడంతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

