కేజ్రీవాల్‌ను అడ్డుకునేందుకే ఎన్సీటీ బిల్లు : మనీష్ సిసోడియా

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను అడ్డుకునేందుకే ఎన్డీయే ప్రభుత్వం ఎన్సీటీ సవరణ బిల్లును తీసుకువచ్చిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు విస్తృతాధికారాలు కట్టబెట్టే ఎన్సీటీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మనీష్ సిసోడియా మోదీ సర్కార్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్‌ను చూసి ఎన్డీయే అభద్రతాభావానికి లోనవుతోందని ఆప్ నేత వ్యాఖ్యానించారు.
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ చర్యలతో బీజేపీ అభద్రతా భావానికి లోనవుతోందని ఎన్సీటీ బిల్లు ఆమోదంతో తేలిపోయిందన్నారు.కేజ్రీవాల్‌ను ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ బిల్లును ప్రయోగించారని ఆరోపించారు. ఢిల్లీలో అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమస్యలు సృష్టించినా వాటిని అధిగమించి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆప్ సర్కార్ నెరవేర్చిందని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- MANISH SISODIA
- NCT bill
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

