బీజేపీ నేత నీలకంఠను హతమార్చిన నక్సల్స్
Neelkanth Kakkem | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఉసూరు బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠ కక్కెంను ఆదివారం నక్సల్స్ కిరాతంగా హత్య చేశారు. కుటుంబం కండ్ల ఎదుటే గొడ్డలి, కత్తులతో నరికి చంపారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.
బీజాపూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఉసూరు బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠ కక్కెంను ఆదివారం నక్సల్స్ కిరాతంగా హత్య చేశారు. కుటుంబం కండ్ల ఎదుటే గొడ్డలి, కత్తులతో నరికి చంపారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. నక్సలైట్ల స్మాల్ యాక్షన్ గ్రూప్ ఈ ఘటనకు పాల్పడింది. నీలకంఠ కక్కెం తన స్వగ్రామమైన ఆవపల్లిలో కుటుంబ సమేతంగా బంధువుల వివాహ వేడుకలను వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లినట్లుగా సమాచారం. తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి అవపల్లికి వస్తున్న సమయంలో నక్సలైట్లు అటకాయించారు.
నీలకంఠను కారు నుంచి బయటకు తీసుకువచ్చి.. గొడ్డలి, కత్తితో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. నీలకంఠ కక్కెం దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. జనపద్ మాజీ పంచాయతీ సభ్యుడు కూడా ఉన్నారు. ఈ ఘటన అవపల్లి పోలీస్ స్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని పేకారంలో చోటుచేసుకుంది. దీంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ ఘటనను బీజాపూర్ ఎస్పీ ధ్రువీకరించారు. అయితే, నీలకంఠ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

