బెంగళూరు: రిపేర్ చేసిన స్కూల్ బస్సు టైరులోకి గాలి నింపుతుండగా అది పేలింది. దీంతో అక్కడున్న మెకానిక్ గాలిలోకి ఎగిరిపడ్డాడు. (Man Tossed In Air) తలకు గాయమైన అతడ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాతీయ రహదారి 66లోని కోటేశ్వర్ సమీపంలో టైరు పంక్చర్ షాపు వద్ద 19 ఏళ్ల అబ్దుల్ రజీద్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం ఒక స్కూల్ బస్సు టైర్‌కు పంక్చర్ అయ్యింది.
కాగా, మెకానిక్ అబ్దుల్ ఆ స్కూల్ బస్సు టైర్‌కు రిపేర్ చేశాడు. అనంతరం టైర్‌లోకి గాలి నింపసాగాడు. అయితే ఉన్నట్టుండి ఆ టైరు పేలింది. ఆ సమయంలో అక్కడ నుంచి కదలబోతున్న అబ్దుల్ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపడ్డాడు. తలకు గాయమైన ఆ యువకుడ్ని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ಪಂಚರ್ ಶಾಪ್ ಒಂದರಲ್ಲಿ ಟೈರಿಗೆ ಗಾಳಿ ತುಂಬುವ ಸಂದರ್ಭ ಟೈರ್ ಸಿಡಿದು ಸ್ಪೋಟಗೊಂಡು ಯುವಕ ಗಂಭೀರ ಗಾಯಗೊಂಡ ಘಟನೆ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಕುಂದಾಪುರ ಬಳಿ ನಡೆದಿದೆ. ಕೋಟೇಶ್ವರದಲ್ಲಿ ಈ ಘಟನೆ ನಡೆದಿದ್ದು, ಗಂಭೀರ ಗಾಯಗೊಂಡ ಯುವಕ ಅಬ್ದುಲ್ ರಜೀದ್ (19) ಎಂದು ಗುರುತಿಸಲಾಗಿದೆ. ಘಟನೆ ಸಿಸಿಟಿವಿಯಲ್ಲಿ ಸೆರೆಯಾಗಿದೆ. @VisitUdupi @UdupiPolice pic.twitter.com/Zf10Ubwt1g
— eedina.com ಈ ದಿನ.ಕಾಮ್ (@eedinanews) December 23, 2024