Affair with Wife | తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. స్నేహితుడి గొంతుకోసి రక్తం తాగాడు
తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని స్నేహితుడి గొంతుకోశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా అతని రక్తం తాగిన ఘటన కర్ణాటకలోని (Karnataka) చిక్కబల్లాపూర్ (Chikkaballapur) జిల్లాలో జరిగింది.
బెంగళూరు: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని స్నేహితుడి గొంతు (Throat) కోశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా అతని రక్తం (Blood) తాగిన ఘటన కర్ణాటకలోని (Karnataka) చిక్కబల్లాపూర్ (Chikkaballapur) జిల్లాలో జరిగింది. చిక్కబల్లాపూర్కు చెందిన విజయ్ (Vijay), మారేశ్ (Maresh) స్నేహితులు. అయితే మారేశ్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని విజయ్ అనుమానం (Affair with wife)పెంచుకున్నాడు. దీంతో అతనిని మాట్లాడాలని పిలిచి నిర్మాణుశ్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.

ఇదే విషయమై ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలో తనతో తెచ్చుకున్న పదునైన ఆయుధంతో మారేశ్ గొంతు కోశాడు విజయ్. అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. మారేశ్ గొంతు నుంచి కారుతున్న రక్తాన్ని తాగడానికి ప్రయత్నించాడు. అయితే ఇందంతా చూసిన ఓ వ్యక్తి.. తన ఫోన్లో బంధించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. నిందితుడు విజయ్ను అరెస్టు చేశారు. కాగా, తీవ్రంగా గాయపడిన మారేశ్ పరిస్థితి ప్రస్తుతం నిలకగడానే ఉన్నదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

