Belagavi : ప్రయాణికులు రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని రైల్వే అధికారులు (Railway officials) ఎన్ని సూచనలు చేసినా కొంతమంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్ని ప్రమాదాల్లో ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా కర్ణాటకలోని బెళగావి రైల్వే స్టేషన్లో అలాంటి ఘటనే జరిగింది.
రన్నింగ్ ట్రెయిన్ నుంచి దిగే క్రమంలో ఓ వ్యక్తి పట్టు తప్పి కింద పడిపోయాడు. ఇది గమనించిన ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వేగంగా స్పందించాడు. పరుగున వెళ్లి ఆ వ్యక్తి రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య నలిగిపోకుండా పక్కకు లాగేశాడు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలను రైల్వేశాఖ విడుదల చేసింది. ప్రయాణికుడిని కాపాడిన కానిస్టేబుల్‌ను అధికారులు అభినందించారు.
Hats off to this hero constable!
At Belagavi Railway Station, a man slipped while getting off a moving train.
An RPF Head Constable immediately pulled him to safety, preventing a tragic accident.
The act was caught on CCTV & he’s being widely praised for his bravery. pic.twitter.com/qovfNhVXEz
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) October 12, 2025