న్యూఢిల్లీ: వీధిలో నడుస్తూ వెళ్తున్న వ్యక్తి వెనుక నుంచి మైనర్ బాలుడు గన్తో తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Man Shot At By Minor Boy) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సీలంపూర్లోని ఖబ్రీ మార్కెట్ ప్రాంతంలో ఒక వ్యక్తి నడుస్తున్నాడు. అతడి వెనుకగా వచ్చిన మైనర్ బాలుడు తుపాకీతో తలపై కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో ఆ వ్యక్తి రోడ్డుపై కుప్పకూలిపోయాడు.
కాగా, కొందరు స్థానికులు వెంటనే స్పందించారు. కాల్పులకు గురైన వ్యక్తిని పక్కకు తిప్పారు. దీంతో అతడు లేచి కూర్చున్నాడు. అయితే షాక్ నుంచి కోలుకోలేకపోయాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తుపాకీ కాల్పులకు గురైన వ్యక్తిని షెహన్వాజ్గా గుర్తించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు షెహన్వాజ్, పిల్లల రంగుల రాట్నం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కాల్పులు జరిపిన నిందితుడ్ని గుర్తించారు. మైనర్ బాలుడు ‘మస్తాన్ గ్యాంగ్’ సభ్యుడని చెప్పారు. ఎందుకు కాల్పులు జరిపాడో అన్నది దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
देखिए दिल्ली की खौफनाक वारदात,जिसका CCTV हुआ वायरल,सीलमपुर में सिर पर सटाकर मारी गोली, दावा है कि नाबालिगों के 'मस्तान गैंग' ने रंगदारी नहीं देने पर वारदात को दिया अंजाम, @DelhiPolice pic.twitter.com/DDezr93A4e
— Lavely Bakshi (@lavelybakshi) April 12, 2024