Lizard Inside Samosa | సమోసాలో బల్లి.. తినబోయి షాకైన వ్యక్తి
Lizard Inside Samosa | ఒక స్వీట్ షాపు నుంచి కొనుగోలు చేసిన సమోసాలో బల్లి కనిపించింది. (Lizard Inside Samosa) దీంతో దానిని తినబోయిన వ్యక్తి షాక్ అయ్యాడు. అక్కడ కొన్న సమోసా తిన్న ఆ వ్యక్తి కుమార్తె ఆసుపత్రి పాలయ్యింది. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లక్నో: ఒక స్వీట్ షాపు నుంచి కొనుగోలు చేసిన సమోసాలో బల్లి కనిపించింది. (Lizard Inside Samosa) దీంతో దానిని తినబోయిన వ్యక్తి షాక్ అయ్యాడు. అక్కడ కొన్న సమోసా తిన్న ఆ వ్యక్తి కుమార్తె ఆసుపత్రి పాలయ్యింది. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. దీపావళి సందర్భంగా ఒక వ్యక్తి ఇంటికి బంధువులు వచ్చారు. ఈ నేపథ్యంలో అతడు చాందీ రోడ్లో ఉన్న స్వీట్ షాప్ నుంచి సమోసాలు కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చిన బంధువులకు ఆ సమోసాలు పెట్టాడు.
కాగా, ఆ వ్యక్తి ఒక సమోసా తినబోగా అందులో బల్లి ఉండటాన్ని గమనించాడు. ఇది చూసి అతడితోపాటు బంధువులు కూడా షాక్ అయ్యారు. సమోసా తిన్న 13 ఏళ్ల కుమార్తె అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు.
మరోవైపు ఆ వ్యక్తి, కుటుంబ సభ్యులు కలిసి సమోసాలు అమ్మిన షాపు వద్దకు వెళ్లారు. సమోసాలో బల్లి ఉండటాన్ని యజమానికి చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సమోసాలో బల్లి ఉండటాన్ని చూపిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#ViralVideos: हापुड़ में समोसा खाते समय आलू की जगह छिपकली देख व्यक्ति के उड़ गए होश pic.twitter.com/IhAUcw1vR8
— princy sahu (@princysahujst7) November 16, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

