Man Sets Mother On Fire | పోలీస్ స్టేషన్లో తల్లికి నిప్పంటించిన కొడుకు.. కాలిన గాయాలతో ఆమె మృతి
Man Sets Mother On Fire | ఆస్తి తగాదాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఒక వ్యక్తి అక్కడ తన తల్లికి నిప్పంటించాడు. షాకైన పోలీసులు మంటలు ఆర్చి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రంగా కాలిన గాయాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
లక్నో: ఆస్తి తగాదాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఒక వ్యక్తి అక్కడ తన తల్లికి నిప్పంటించాడు. (Man Sets Mother On Fire) షాకైన పోలీసులు మంటలు ఆర్చి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రంగా కాలిన గాయాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూమి వివాదం నేపథ్యంలో ఒక కుటుంబం ఖైర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఒక మహిళ, ఆమె కొడుకు ఒక పక్కకు వెళ్లారు. ఆ మహిళ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. లైటర్‌తో నిప్పంటించుకుంటానని బెదిరించింది.
కాగా, పోలీసులు ఆ మహిళ ప్రయత్నాన్ని అడ్డుకుకున్నారు. ఆమె చేతిలోని లైటర్‌ను లాక్కోగా అది కింద పడింది. అయితే మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తున్న మహిళ కుమారుడు వెంటనే కింద పడిన లైటర్ తీసుకున్నాడు. ఆ లైటర్‌తో తన త్లలికి నిప్పంటించాడు. మంటల్లో ఆమె కాలుతుండటాన్ని మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు.
మరోవైపు ఇది చూసి పోలీసులు షాక్ అయ్యారు. మంటల్లో కాలుతున్న ఆ మహిళను కాపాడేందుకు ప్రయత్నించారు. గోనె సంచులు కప్పి, మట్టి చల్లి మంటలు ఆర్పివేశారు. 40 శాతం కాలిన గాయాలైన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ మహిళ మరణించింది.
మృతురాలిని హేమలతగా పోలీసులు గుర్తించారు. తల్లికి నిప్పంటించిన 22 ఏళ్ల కుమారుడు గౌరవ్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तर प्रदेश के अलीगढ़ के खैर थाना परिसर में एक महिला ने केरोसिन डालकर खुद को आग लगा ली….
थाने में महिला के जलते हुए की वीडियो वायरल हुई है. आरोप है कि पीड़ित महिला फरियाद लगा रही थी, लेकिन पुलिस कोई सुनवाई नहीं कर रही थी,महिला को अस्पताल भर्ती करवाया गया… pic.twitter.com/Dp3qoQbQ9a
— आदित्य तिवारी / Aditya Tiwari (@aditytiwarilive) July 16, 2024
अलीगढ़ : खैर थाने में महिला को आग लगने का CCTV आया सामने
➡थाना परिसर में महिला को उसके बेटे ने ही लगाई थी आग
➡बेटे के द्वारा आग लगाने का सीसीटीवी फुटेज आया सामने
➡CCTV में महिला का बेटा मोबाइल से वीडियो बनाता दिखा
➡महिला का पति के मामा से चल रहा था जमीन का विवाद
➡थाना… pic.twitter.com/cBA6FrMXAO— भारत समाचार | Bharat Samachar (@bstvlive) July 16, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Aligarh
- MAN
- Mother
- Police station
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

