Man Rapes, Impregnates Teen | పొరుగింటి బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన యువకుడు
Man Rapes, Impregnates Teen | ఒక యువకుడు పొరుగింటి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బాలిక తండ్రికి తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడ్ని అరెస్ట్ చేశారు.
లక్నో: ఒక యువకుడు పొరుగింటి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బాలిక తండ్రికి తెలిసింది. (Man Rapes, Impregnates Teen) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మురాద్‌నగర్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఆరో తరగతి చదువుతున్నది. ఆమె తల్లి భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. దీంతో తండ్రితో కలిసి ఆ బాలిక ఉంటున్నది.
కాగా, బాలిక తండ్రి పనికి వెళ్లినప్పుడు పొరుగింటికి చెందిన 20 ఏళ్ల యువకుడు ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు.
మరోవైపు ఆదివారం తీవ్ర కడుపు నొప్పితో బాధపడిన ఆ బాలిక స్పృహతప్పి పడిపోయింది. తండ్రి ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షలో తేలింది. దీంతో జరిగిన దాని గురించి ఆ బాలిక చెప్పింది. ఆమె తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో 20 ఏళ్ల పొరుగింటి యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- impregnates
- MAN
- rapes
- Teen
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

