భార్యను మూడో అంతస్థు పైనుంచి తోసేసిన భర్త
మూడో అంతస్థు| కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను మూడంస్థుల బిల్డింగ్ పైనుంచి తోసేశాడో కీచక భర్త. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. తన మరదలికి ఫోన్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ దుర్ఘటన రాజస్థాన్‌లోని కోటాలో జరిగింది.

జైపూర్: కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను మూడంస్థుల బిల్డింగ్ పైనుంచి తోసేశాడో కీచక భర్త. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. తన మరదలికి ఫోన్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ దుర్ఘటన రాజస్థాన్‌లోని కోటాలో జరిగింది.
కోటాకు చెందిన నిషా బైర్వా, హన్స్‌రాజ్ బైర్వా భార్యా భర్తలు. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె తన మేనమామ ఇంటివద్ద ఉంటున్నది. అయితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కిరాయికి ఇళ్లు కోసం వెతకడానికి పట్టణంలోని ఉద్యోగ్ నగర్‌కు వెళ్లారు. అక్కడ ఓ మూడంతస్థుల ఇంట్లో రూమ్‌ని చూశారు.
అయితే అక్కడ అంతా నిర్మానుష్యంగా ఉండటంతో అదే అదునుగా భావించిన హన్స్‌రాజ్.. నిషాను బిల్డింగ్ పైనుంచి కిందికి నెట్టేశాడు. అంతెత్తు నుంచి కింద పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న అనంతరం.. నిష మరణించిన విషయాన్ని అతని మరదలికి ఫోన్ చేసి చెప్పాడని, తర్వాత అక్కడి నుంచి పారిపోయాడని పోలీసు అధికారి మహమ్మద్ ఇబ్రహిం చెప్పారు. నిందితుని కోసం గాలిస్తున్నామని, అతనిపై ఐపీసీ సెక్షన్ 30 కింద కేసు నమోదు చేశామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

