Viral video | ఎయిర్‌పోర్ట్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు ఎలా ప్రపోజ్ చేశాడంటే..!
హాలీవుడ్ మూవీని తలపించేలా ఎయిర్పోర్ట్ వేదికగా ఓ వ్యక్తి ఎయిర్‌హోస్టెస్‌కు (Viral video) ప్రపోజ్ చేశాడు. డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో అప్పుడే ల్యాండయిన ఎయిర్‌హోస్టెస్‌ను ప్రియుడు తన ప్రపోజల్‌తో సర్ప్రైజ్ చేశాడు.
న్యూఢిల్లీ : హాలీవుడ్ మూవీని తలపించేలా ఎయిర్పోర్ట్ వేదికగా ఓ వ్యక్తి ఎయిర్‌హోస్టెస్‌కు (Viral video) ప్రపోజ్ చేశాడు. డబ్లిన్ ఎయిర్‌పోర్ట్‌లో అప్పుడే ల్యాండయిన ఎయిర్‌హోస్టెస్‌ను ప్రియుడు తన ప్రపోజల్‌తో సర్ప్రైజ్ చేశాడు. ఈ వీడియోను గుడ్‌న్యూస్ మూవ్మెంట్ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేయగా ఇప్పటివరకూ 20 లక్షల మందికిపైగా వీక్షించారు.
వైరల్ వీడియోలో ఓ వ్యక్తి ఎయిర్పోర్ట్ అరైవల్స్ వద్ద తన గర్ల్‌ఫ్రెండ్ కోసం వేచిచూడటం కనిపిస్తుంది. ఆమె ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అవుతూనే తన బాయ్‌ఫ్రెండ్‌ను చూసి నవ్వుతూ దగ్గరకు రాగా, అతడు ఆమెకు బోకే ఇచ్చి మోకాలుపై కూర్చుని ప్రపోజ్ చేస్తాడు. ఆపై ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకోగా గర్ల్‌ఫ్రెండ్‌ను అతడు తన చేతులతో పైకెత్తడం వైరల్ క్లిప్‌లో చూడొచ్చు. ఈ సమయంలో ఓ వ్యక్తి పియానో ప్లే చేస్తుంటాడు.
డబ్లిన్ ఎయిర్పోర్ట్ అరైవల్స్‌లో బాయ్‌ఫ్రెండ్ ప్రత్యక్షం కావడంతో అసలేం జరుగుతుందో ఈ ఎయిర్‌హోస్టెస్‌కు తెలియదని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇంటర్నెట్లో మిశ్రమ స్పందన లభించింది. ఇది అద్భుతమైన ప్రపోజల్ ఐడియా అని కొందరు కితాబివ్వగా మరికొందరు ఇదేం ప్రపోజల్ అంటూ పెదవివిరిచారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆ సమయంలో అక్కడున్న వారందరినీ ప్రేమ కలిపిందని ఓ యూజర్ రాసుకొచ్చారు. బ్యూటిఫుల్ అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More
Rajasthan | ప్రియుడితో వెళ్లిపోయిన పెండ్లి కూతురు.. 13 రోజల పాటు వేచి ఉండి ఆమెనే పెండ్లాడిన వరుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

