Viral Pic | కారు ఓనర్‌కు రూ. 26వేల ఫైన్.. ఇంతకీ కారణమేంటో తెలుసా ?
వేగంగా వెళుతున్న కారు రూఫ్‌పై ఓ వ్యక్తి ప్రమాదకర విన్యాసాలు చేసిన ఘటన నోయిడాలోని సెక్టార్ 18లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావడంతో కారు యజమానికి నోయిడా ట్రాఫిక్ పోలీసులు చలానా జారీ చేశారు.
నోయిడా : వేగంగా వెళుతున్న కారు రూఫ్‌పై ఓ వ్యక్తి ప్రమాదకర విన్యాసాలు (Viral Pic) చేసిన ఘటన నోయిడాలోని సెక్టార్ 18లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావడంతో కారు యజమానికి నోయిడా ట్రాఫిక్ పోలీసులు చలానా జారీ చేశారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో నోయిడా వీధుల్లో తిరిగిన ఈ కారు వీడియో వైరల్ కావడంతో నోయిడా ట్రాఫిక్ పోలీసులు సత్వరమే స్పందించి కారు యజమాని మహేష్ పాల్‌పై చర్యలు చేపట్టారు.
ఈ వీడియోలో వైట్ మారుతి స్విఫ్ట్ కారును ఓ వ్యక్తి నడుపుతుండగా యల్లో టీ షర్ట్ ధరించిన మరో వ్యక్తి కారు రూఫ్‌పై విన్యాసాలు చేయడం కనిపిస్తుంది. ఇతర వాహనాలను ఈ కారు ఓవర్టేక్ చేస్తూ దూసుకుపోవడంతో అటుగా వెళుతున్నవారు దిగ్భ్రాంతికి గురవడం చూడొచ్చు. ఈ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేసిన వారు నోయిడా ట్రాఫిక్ పోలీస్ అధికారులను ట్యాగ్ చేస్తూ కారు యజమానిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
నిబంధనలను అతిక్రమించిన వాహనాన్ని సీజ్ చేయాలని పలువురు యూజర్లు కోరారు. వైరల్ వీడియోపై స్పందించిన నోయిడా ట్రాఫిక్ పోలీసులు కారు యజమానిపై మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. అన్ని ఉల్లంఘనలకు కలిపి ట్రాఫిక్ పోలీసులు వాహన యజమానికి రూ. 26,000 జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై కఠిన చర్యలు చేపడతామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
Read More :
Joe Biden | పిల్లలూ నాకు గొప్ప ఐస్‌క్రీం ప్రదేశాలు తెలుసు.. కావాలంటే నన్ను అడగండి : బైడెన్ సరదా వ్యాఖ్యలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- dangerous stunt
- MAN
- Noida
- viral pic
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

