Watch: భూ వివాదం నేపథ్యంలో సోదరుడి మీదకు ట్రాక్టర్ నడిపిన వ్యక్తి.. వీడియో వైరల్
Man Mows Down Brother With Tractor | భూ వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సోదరుడి మీదకు ట్రాక్టర్‌ను నడిపి చక్రాలతో తొక్కించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: భూ వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సోదరుడి మీదకు ట్రాక్టర్‌ను నడిపి చక్రాలతో తొక్కించాడు. (Man Mows Down Brother With Tractor) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తివాయా గ్రామానికి చెందిన అన్నాదమ్ములైన రామ్‌కుమార్, ఓంకుమార్ మధ్య పూర్వీకులకు సంబంధించిన భూమిపై వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా, ట్రాక్టర్‌పై ఉన్న రామ్‌కుమార్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎదురుగా ఉన్న సోదరుడైన 65 ఏళ్ల ఓంకుమార్ మీదకు ట్రాక్టర్‌ను దూకించాడు. ఇటుక గోడను ఢీకొట్టి మరీ సోదరుడ్ని ట్రాక్టర్ చక్రాలతో తొక్కించాడు. దీంతో తమ్ముడు ఓంకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన ఓంకుమార్ భార్య కూడా గాయపడింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ టైర్ల కింద నలిగిన ఓంకుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతడి పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
सहारनपुर- जमीन विवाद में भाई ने भाई पर चढ़ाया ट्रैक्टर,वायरल सीसीटीवी फुटेज की जांच में जुटी पुलिस,सहारनपुर के तिवाया गांव में दो भाइयों में था विवाद,भाई की पत्नी के साथ मारपीट की, दोनों घायल हुए।#Saharanpur pic.twitter.com/EkAG8aRfgg
— Dinesh Kumar (@DineshRedBull) March 29, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Brother
- land dispute
- MAN
- Mows Down
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

