Man Modifies Car Into Chopper | కారును హెలికాప్టర్ మాదిరిగా మార్చిన వ్యక్తి.. అధికారులు ఏం చేశారంటే?
Man Modifies Car Into Chopper | ఒక వ్యక్తి పాత కారును హెలికాప్టర్ మాదిరిగా మార్చాడు. గమనించిన ట్రాఫిక్ పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తికి జరిమానా విధించారు.
లక్నో: ఒక వ్యక్తి పాత కారును హెలికాప్టర్ మాదిరిగా మార్చాడు. (Man Modifies Car Into Chopper) గమనించిన ట్రాఫిక్ పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ వ్యక్తికి జరిమానా విధించారు. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో ఈ సంఘటన జరిగింది. ఖజూరి బజార్లో నివసించే ఈశ్వర్ దీన్ వినూత్నంగా ఆలోచించాడు. తన కారును హెలికాప్టర్ మాదిరిగా తీర్చిదిద్దాడు. దానికి ఆ మేరకు రంగులు వేయించేందుకు వర్క్ షాపు నుంచి తీసుకెళ్లాడు.
కాగా, హెలికాప్టర్ మాదిరిగా మార్చిన ఆ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దానిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహన చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.2,000 జరిమానా విధించారు. హెలికాప్టర్ మాదిరిగా ఉన్న తోక భాగాన్ని తొలగింపజేశారు. ఈశ్వర్ ఆ చలానా కట్టడంతో కారును విడిచిపెట్టారు.
మరోవైపు వివాహ వేడుకలు, ఇతర కార్యక్రమాలకు అద్దెకు ఇచ్చి కొంత అదనంగా సంపాదించడం కోసం కారును హెలికాప్టర్ మాదిరిగా తీర్చిదిద్దినట్లు ఈశ్వర్ తెలిపాడు. తమ ప్రాంతంలో ఇలాంటి తరహా వాహనాలు చాలా ఉన్నాయని చెప్పాడు. దీని కోసం ఇప్పటికే సుమారు రూ.2.5 లక్షలు ఖర్చు చేసినట్లు అతడు వాపోయాడు.
#Watch | Uttar Pradesh Man Modifies Car Into 'Chopper', Cops Seize Vehicle For Flouting Rules
📹: ANI
Read Here: https://t.co/VbjeMTCQCG pic.twitter.com/MyGIk8Xa9q
— NDTV (@ndtv) March 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ambedkar Nagar
- car
- Chopper
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

