Street dog | వీధి కుక్కను చంపి.. తాడుతో కట్టి 100 మీటర్లు లాక్కెళ్లిన వ్యక్తి
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో (Lucknow) అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. వీధి కుక్కను (Street dog) చంపిన ఓ వ్యక్తి.. దానిని తాడుతో కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో (Lucknow) అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. వీధి కుక్కను (Street dog) చంపిన ఓ వ్యక్తి.. దానిని తాడుతో కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పప్పు (Pappu) అనే వ్యక్తి ఓ వీధి శునకాన్ని కిరాతకంగా చంపేశాడు. అనంతరం దాని కాలును తాడుతో కట్టేసి రోడ్డుపై సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లి.. కాలువలో (Drain) పడేశాడు. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన అతనికి ఓ ఆటో డ్రైవర్ సహకరించాడు. కుక్కను తాడుతోకట్టి ఈడ్చుకెళ్తుంగా పప్పు వెనక ఓ వృద్ధుడు నడుస్తున్న దృష్యాన్ని వీడియోలో చూడవచ్చు.
ఈ ఘటన లక్నోలోని నౌబస్తా మార్కెట్ (Noubasta market) ప్రాంతంలో జరిగిందని ఏడీసీపీ చిరంజీవి నాథ్ సిన్హా (Chiranjeevi Nath Sinha) తెలిపారు. అతనిపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, పప్పు చర్యపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

