Human sacrifice | భార్యకు గర్భస్రావం కాకుండా ఉండేందుకు.. పొరుగింటి బాలికను బలి ఇచ్చిన వ్యక్తి
Human sacrifice | సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అలోక్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.
కోల్‌కతా: భార్యకు మరోసారి గర్భస్రావం కాకుండా ఉండేందుకు మంత్రగాడి సలహా పాటించిన ఒక వ్యక్తి పొరుగింటి బాలికను నర బలి (Human sacrifice) ఇచ్చాడు. ఆ చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. బీహార్‌కు చెందిన అలోక్ కుమార్, కోల్‌కతాలోని టిల్జాలా ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడి భార్యకు మూడుసార్లు గర్భస్రావమైంది. ఆమె మళ్లీ గర్భం దాల్చింది. భార్యకు ఈసారి గర్భస్రావం కాకుండా ఉండేందుకు అలోక్ కుమార్ ఒక మంత్రగాడిని సంప్రదించాడు. ఒక చిన్నారిని నరబలి ఇస్తే ఆమె గర్భం నిలుస్తుందని ఆ మంత్రగాడు చెప్పాడు. దీంతో అలోక్ కుమార్, ఆదివారం సాయంత్రం పొరుగున ఉండే ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. నర బలి పేరుతో దారుణంగా హత్య చేశాడు. ఆ బిల్డింగ్‌లోనే పలు గాయాలతో ఉన్న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆదివారం రాత్రంతా వారు నిరసనకు దిగారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అలోక్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. తన భార్యకు మరోసారి గర్భస్రావం కాకుండా ఉండేందుకు మంత్రగాడి సలహా మేరకు బాలికను నర బలి ఇచ్చినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆ బాలికపై లైంగిక దాడి జరిగిందా లేదా అన్నది కూడా తెలుసుకుంటామని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read:
Human sacrifice | ఉత్తరప్రదేశ్‌లో నరబలి కలకలం.. కొడుకు ఆరోగ్యం కోసం 10 ఏండ్ల బాలుడిని చంపాడు
Puducherry BJP worker | బైకులపై వచ్చి బాంబులు విసిరి.. పుదుచ్చేరి బీజేపీ నేతను నరికి చంపిన దుండగులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

