ధర్మశాల, జూన్ 26: హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన హరీశ్ మహాజన్ తన భార్యకు పుట్టిన రోజు బహుమతిగా చంద్రుడిపై ఎకరం స్థలాన్ని ఇచ్చారు. హరీశ్ భార్య పూజ పుట్టిన తేదీ జూన్ 23. భార్యకు గిఫ్ట్‌గా చంద్రుడిపై స్థలం కొనడానికి ఏడాది ముందు నుంచే ప్లాన్ చేశారు హరీశ్.
న్యూయార్క్‌లో ఉన్న ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ సొసైటీకి దరఖాస్తు చేసుకొన్నారు. ఇటీవలే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు హరీశ్‌కు ఆన్లైన్ ద్వారా అందాయి. అనూహ్య బహుమతితో పూజ ఆశ్చర్యపోయారు. స్థలాన్ని ఎంతకు కొన్నారనేది మాత్రం హరీశ్ వెల్లడించలేదు.