RTI Query| ఆర్టీఐ కింద దరఖాస్తు.. 40 వేల పేజీల్లో అధికారుల సమాధానం!
ఇండోర్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ఓ ప్రశ్నకు అధికారుల ఏకంగా 40,000 పేజీల్లో సమాధానం ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లను తీసుకెళ్లడానికి దరఖాస్తుదారుడు కారును తీసుకురాగా, కారు మొత్తం నిండిపోయింది.
RTI Query| ఇండోర్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ఓ ప్రశ్నకు అధికారుల ఏకంగా 40,000 పేజీల్లో సమాధానం ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లను తీసుకెళ్లడానికి దరఖాస్తుదారుడు కారును తీసుకురాగా, కారు మొత్తం నిండిపోయింది. అధికారులు తన దరఖాస్తుకు నెలలోపు సమాధానం ఇవ్వకపోవడంతో పేజీకి రూ.2 చొప్పున చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. ధర్మేంద్ర శుక్లా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఇండోర్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌కు ఓ దరఖాస్తు చేశారు. కరోనా సమయంలో ఔషధాలు, వైద్య పరికరాలు, ఇతర మెటీరియల్స్ కోసం జారీచేసిన టెండర్లు, బిల్లుల చెల్లింపునకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అడిగారు. అధికారులు నెలలోపు సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన ఫస్ట్ అప్పిలేట్ ఆఫీసర్ శరద్గుప్తాను ఆశ్రయించారు. అభ్యర్థనను అంగీకరించిన శరద్గుప్తా.. దరఖాస్తుదారుడికి ఉచితంగా సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
‘డాక్యుమెంట్లను తీసుకువెళ్లేందుకు నా కారును తీసుకురావాల్సి వచ్చింది. డ్రైవర్ సీటు తప్ప కారు మొత్తం డాక్యుమెంట్లతో నిండిపోయింది’ అని ధర్మేంద్ర శుక్లా తెలిపారు. నిర్దేశిత సమయంలోగా సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ ఖజానాకు రూ.80 వేల నష్టం వాటిల్లజేసిన సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అప్పిలేట్ ఆఫీసర్ శరద్ గుప్తా అధికారులను ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

