న్యూఢిల్లీ : దేశీ పెండ్లిండ్లు ఆటా పాటా లేకుండా ముగియడం అరుదు. ఓ వెడ్డింగ్ వేడుకలో అలనాటి బాలీవుడ్ సాంగ్ జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా సాంగ్‌కు హుషారైన స్టెప్స్‌తో ఓ వ్యక్తి అదరగొట్టిన వీడియో తాజాగా నెట్టింట తెగ వైరలవుతోంది. రోహిత్ విశ్వాస్ అనే ఇన్స్టాగ్రాం యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పటివరకూ 19,000 మందికిపైగా వీక్షించారు.
ఈ వీడియోలో బప్పీలహరి ఎవర్గ్రీన్ డ్యాన్స్ నెంబర్ జిమ్మీ జిమ్మీ పాటకు కిల్లర్ మూమెంట్స్‌తో ఓ వ్యక్తి నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌కు పెండ్లి వేడుకకు హాజరైన వారంతా మెస్మరైజ్ అయ్యారు.
గెస్ట్‌లంతా క్లాప్స్‌తో హుషారెత్తిస్తూ అతడిని ప్రోత్సహిస్తుండటం వైరల్ వీడియోలో కనిపించింది. 1982లో విడుదలైన డిస్కో డ్యాన్సర్ మూవీలోని జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేసింది. ఈ పాటకు డ్యాన్స్ చేసిన వ్యక్తిపై పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలు కురిపించారు.