Viral news: భార్యను కాటేసిన పామును సీసాలోపెట్టి దవాఖానకు తీసుకెళ్లిన భర్త.. ఎందుకోసమంటే?
తన భార్యను కాటేసిన పామును పట్టుకొని ఓ భర్త సీసాలో బంధించాడు. భార్యతోపాటు ఆ పామును దవాఖానకు తీసుకెళ్లాడు. ఆ పామును చూసి వైద్య సిబ్బంది అవాక్కయ్యారు. పామును దవాఖానకు ఎందుకు తెచ్చావ్? అని అడిగిన ప్రశ్నకు ఆ భర్త ఇచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్‌లో జరిగింది.
తన భార్యను కాటేసిన పామును పట్టుకొని ఓ భర్త సీసాలో బంధించాడు. భార్యతోపాటు ఆ పామును దవాఖానకు తీసుకెళ్లాడు. ఆ పామును చూసి వైద్య సిబ్బంది అవాక్కయ్యారు. పామును దవాఖానకు ఎందుకు తెచ్చావ్? అని అడిగిన ప్రశ్నకు ఆ భర్త ఇచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్‌లో జరిగింది.
అఫ్జల్నగర్లోని మఖి పోలీస్ సర్కిల్ పరిధిలో నివసించే రామేంద్రయాదవ్ భార్యను పాము కాటేసింది. దీంతో రామేంద్రయాదవ్ పామును పట్టుకొని ప్లాస్టిక్ సీసాలో బంధించాడు. భార్యతోపాటు పామును కూడా స్థానిక దవాఖానకు తీసుకెళ్లాడు. పామును ఎందుకు తీసుకొచ్చావ్? అని వైద్యులు అతడిని ప్రశ్నించారు. ‘నా భార్యకు ఏ పాము కరిచిందని మీరు అడిగితే నేనేం చెప్పాలి. అందుకే పామును తీసుకొచ్చాను. ఇక ఏ పాము కరిచిందో మీరే చూసుకొని వైద్యం చేయొచ్చు’ అని వింత సమాధానమివ్వడంతో వైద్యులు కంగుతిన్నారు. అతని భార్య దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యాక పామును సమీపంలోని అడవిలో విడిచిపెడతానని రామేంద్రయాదవ్ మీడియాతో తెలిపాడు. పాముకు ఊరిరాడేలా ప్లాస్టిక్ బాటిల్‌కు రంధ్రాలు చేశానని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

