Watch: ‘గుట్కా ఉయ్యాలి, విండో తెరుస్తారా?’.. ఎయిర్ హోస్టెస్‌ను అడిగిన వ్యక్తి, తర్వాత ఏమైందంటే!
ఒక వ్యక్తి ‘గుట్కా ఉయ్యాలి, విమానం విండో తెరుస్తారా?’ అంటూ ఎయిర్ హోస్టెస్‌ను అడిగాడు. దానికి ఆమె స్పందించిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: ఇటీవల విమానాల్లో ప్రయాణికుల మూత్ర విసర్జన, ఎమర్జెన్సీ విండో తెరిచిన సంఘటనలు కలకలం రేపాయి. ఈ తరుణంలో ఒక వ్యక్తి ‘గుట్కా ఉయ్యాలి, విమానం విండో తెరుస్తారా?’ అంటూ ఎయిర్ హోస్టెస్‌ను అడిగాడు. దానికి ఆమె స్పందించిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి విమానంలో ప్రయాణించాడు. విమానం విండో చివరివైపు సీటులో అతడు కూర్చొన్నాడు. చేతిలో గుట్కా వంటిది నలుపుతూ ఎయిర్ హోస్టెస్‌ను పిలిచాడు. ‘నేను గుట్కా ఉమ్మివేయాలి, దయచేసి విమానం కిటికీ తెరుస్తారా?’ అని ఆమెను అడిగాడు.
కాగా, ఆ వ్యక్తి మాటలకు ఆ ఎయిర్ హోస్టెస్తోపాటు విమానంలోని ఇతర ప్రయాణికులు తెగ నవ్వుకున్నారు. ఈ రిక్వెస్ట్ చేసిన ఆ వ్యక్తి కూడా చిలిపిగా నవ్వడంతో అతడు తమాషా చేసినట్లు అంతా భావించారు. దీంతో అందరూ దీనిని ఫన్నీగా తీసుకున్నారు. గోవింద్ శర్మ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు. ‘మీ గుట్కా ప్రేమికుడ్ని ట్యాగ్ చేయండి’ అని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

