సోషలిజంను పెళ్లి చేసుకోనున్న మమతా బెనర్జీ.. ఇన్విటేషన్ వైరల్

చెన్నై: మీరు చదివింది నిజమే. వచ్చే ఆదివారం సోషలిజాన్ని పెళ్లి చేసుకోబోతోంది మమతా బెనర్జీ. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ పెళ్లి జరగబోతోంది. దీనికి సంబంధించి తమిళంలో ఉన్న ఇన్విటేషన్ కార్డ్ వైరల్గా మారింది. ఇదేదో తమాషాకు ప్రింట్ చేయించిన ఇన్విటేషన్ కార్డు కాదు. ఇది నిజమైన పెళ్లే. సోషలిజం వరుడి పేరు కాగా.. మమతా బెనర్జీ వధువు పేరు. తమిళనాడుకు చెందిన సేలం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) జిల్లా కార్యదర్శి మోహన్ కుమారుడే ఈ సోషలిజం.
ఎన్నాళ్లుగానో కమ్యూనిజాన్ని ఫాలో అవుతున్న మోహన్ కుటుంబం.. తన మరో ఇద్దరు కొడుకులకు కమ్యూనిజం, లెనినిజం అనే పేర్లు పెట్టారు. 2016లో ఈయన వీరపాండి నియోజకవర్గం నుంచి పీపుల్స్ వెల్ఫేర్ అలయెన్స్ తరఫున పోటీ చేశారు.
ఇక్కడ విచిత్రమేమిటంటే వరుడి కుటుంబం కమ్యూనిజానికి వీరాభిమానులు కాగా.. వధువు కుటుంబం మాత్రం కాంగ్రెస్ విధేయులు. చాన్నాళ్లుగా ఆ పార్టీ మద్దతుదారులుగా ఉన్నారు. అందుకే తమ కూతురికి కూడా ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ పేరు పెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

