Mamata Banerjee | సందేశ్‌ఖాలీ మహిళలతో కలిసి మమతా ర్యాలీ.. మోదీపై విమర్శలు
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మహిళలతో కలిసి కోల్‌కతాలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. టీఎంసీ నేతల లైంగిక దాడుల ఆరోపణలతో రగులుతున్న సందేశ్‌ఖాలీ దీవికి చెందిన మహిళలు కూడా ఇందులో పాల్గొన్నారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మహిళలతో కలిసి కోల్‌కతాలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. టీఎంసీ నేతల లైంగిక దాడుల ఆరోపణలతో రగులుతున్న సందేశ్‌ఖాలీ దీవికి చెందిన మహిళలు కూడా ఇందులో పాల్గొన్నారు. ‘మహిళల హక్కులు, మా నిబద్ధత’ అన్న నినాదంతో సాగిన ఈ ర్యాలీలో బీజేపీతోపాటు ప్రధాని మోదీని మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్లో మహిళలను హింసిస్తున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించారు. బెంగాల్లోనే మహిళలు అత్యంత సురక్షితమని, దీనిని తాను నిరూపించగలనని సవాల్ చేశారు.
కాగా, ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు, హత్రాస్‌లో ఒక మహిళపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని బలవంతంగా దహనం చేసినప్పుడు, ఆయన (మోదీ) ఎక్కడ ఉన్నారు?’ అని ప్రశ్నించారు. బిల్కిస్ (బానో)ను మీరు మరిచిపోయారా? అని నిలదీశారు.
మరోవైపు కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలో చేరడంపై మమతా బెనర్జీ స్పందించారు. ‘ఒక బీజేపీ బాబు గద్దె మీద కూర్చున్నాడు. ఆయన ఇప్పుడు బీజేపీలో చేరాడు. మీరు వారి నుంచి న్యాయం ఎలా ఆశిస్తారు?’ అని ఎద్దేవా చేశారు. కాగా, మార్చి 8న శివరాత్రితోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

