Mamata Banerjee: ఏకపక్ష చర్చలను వ్యతిరేకిస్తున్నాం.. మోదీకి లేఖ రాసిన దీదీ
Mamata Banerjee: తీస్తా నదీ జలాల పంపిణీపై ఇటీవల బంగ్లాదేశ్, భారత్ ప్రధానుల మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆమె మోదీకి లేఖ రాశారు.
న్యూఢిల్లీ: తీస్తా నదీ జలాల పంపిణీపై ఇటీవల బంగ్లాదేశ్, కేంద్ర సర్కారు మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చలను ఏకపక్షంగా నిర్వహించినట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. బంగ్లాదేశ్‌తో జరిగిన చర్చలకు తమను ఆహ్వానించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోకుండా అలాంటి చర్యలు, చర్చలు చేపట్టడం సరికాదు అని, ఆమోదించలేమని ఆమె అన్నారు. గంగా నది, తీస్తా నది జలాల షేరింగ్ అంశంపై ఇటీవల ప్రధాని షేక్ హసీనా, మోదీ మధ్య చర్చలు జరిగాయి.
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఫరక్కా ఒప్పందాన్ని రెన్యువల్ చేయాలన్న ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తోందని, 1996లో కుదిరిన ఆ చట్టం.. 2026లో ముగిసిపోనున్నదని, ఆ ఒప్పందం ప్రకారం భారత్, బంగ్లా మధ్య నీటి పంపిణీ జరుగుతుందని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్‌పై ఆ ఒప్పంద ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె తన లేఖలో తెలిపారు. అలాంటి ఒప్పందాల వల్ల బెంగాల్ ప్రజలు తీవ్ర ప్రభావానికి గురవుతారన్నారు.
నీట్ పరీక్షా వ్యవస్థను రద్దు చేయాలని కూడా తన లేఖలో దీదీ కోరారు. పేపర్ లీకేజీని దృష్టిలో పెట్టుకుని, ఆ పరీక్షలను రాష్ట్రాలే నిర్వహించే విధంగా వ్యవస్థను రీస్టోర్ చేయాలని ఆమె కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

