Mallikarjun Kharge: భజరంగ్‌దళ్‌పై ఖర్గే వ్యాఖ్యలు.. కాంగ్రెస్ చీఫ్‌పై రూ. 100 కోట్ల పరువునష్టం కేసు
Kharge Summoned: ఖర్గేపై వంద కోట్ల పరువునష్టం కేసు వేశారు. భజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేస్తామని ఖర్గే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో హితేశ్ భరద్వాజ్ అనే వ్యక్తి పంజాబ్‌లో ఈ కేసును ఫైల్ చేశారు.
బెంగుళూరు: కర్ణాటక ఎన్నికల ప్రచార సమయంలో.. భజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యల నేపథ్యంలో .. పంజాబ్ కోర్టులో ఖర్గేపై పరువునష్టం కేసు నమోదు అయ్యింది. హిందూ సురక్షా పరిషద్ భజరంగ్‌దళ్ హింద్ వ్యవస్థాపకుడు హితేశ్ భరద్వాజ్.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేపై వంద కోట్ల పరువునష్టం కేసును ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో సంగ్రూర్ కోర్టు కాంగ్రెస్ నేతకు సమన్లు జారీ చేసింది. జూలై పదో తేదీన కోర్టుకు హాజరుకావాలంటూ ఖర్గేను సివిల్ జడ్జి రమణ్‌దీప్ కౌర్ ఆదేశించారు.
భజరంగ్‌దళ్‌ను జాతీయ వ్యతిరేక సంస్థగా కాంగ్రస్ పార్టీ ఆరోపించిందని, కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక భజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేస్తామని ఆ పార్టీ పేర్కొన్నట్లు హితేశ్ తన పరువునష్టం దావాలో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 10లో ఉన్న అంశాల ఆధారంగా గురువారం కోర్టును ఆశ్రయించినట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

