న్యూఢిల్లీ: పార్లమెంట్లో కేంద్ర బలగాలను(CISF) వినియోగిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభలో గందరగోళం నెలకొన్నది. విపక్షాలు చేపట్టిన నిరసనను డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ తప్పుపట్టారు. మల్లిఖార్జున్ రాసిన లేఖను మీడియాకు రిలీజ్ చేయడం లేదని హరివంశ్ తెలిపారు. సభలో విపక్ష సభ్యులు చేస్తున్న నిరసనను డిప్యూటీ చైర్మెన్ ఖండించారు. మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. సభలో సాయుధ బలగాలను మోహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో సభాపతి, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
मैंने सदन में हुए उस दिन के घटनाक्रम के बारे में पत्र लिखा था। मैंने उस पत्र में लिखा था 👇
‘I am writing to you on behalf of all Opposition parties in Rajya Sabha.
We are astonished and shocked at the manner in which CISF personnel are made to run into the well of the House… pic.twitter.com/s2wY6GHasm
— Gautam Nautiyal (@Gnukpcc) August 5, 2025
సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. వెల్‌లోకి దూసుకువస్తున్నారని, ఇది ఆశ్చర్యకరంగా, షాకింగ్‌గా ఉన్నట్లు ఖర్గే ఆరోపించారు. సభ్యులు తమ ప్రజాస్వామ్య బద్దమైన హక్కుల అంశంలో నిరసన చేపడుతున్నప్పుడు సీఐఎస్ఎఫ్ దళాలు ఎలా వచ్చాయని ఖర్గే ప్రశ్నించారు. నిన్న ఇదే జరిగింది, ఇవాళ ఇదే జరిగిందన్నారు. మన పార్లమెంట్ అంత దిగజారిపోయిందా అని అడిగారు. భవిష్యత్తులో సీఐఎస్ఎఫ్ దళాలు.. హౌజ్ వెల్‌లోకి దూసుకువస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
హౌజ్ వెల్‌లోకి కేవలం మార్షల్స్‌ను మాత్రమే అనుమతిస్తారని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు. ఖర్గే సభను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది హౌజ్‌లో ఉన్నట్లు ఖర్గే చేసిన ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. సభను చైర్మెన్ నడిపిస్తున్నారా లేక మంత్రి అమిత్ షా నడిపిస్తున్నారా అని ఖర్గే ప్రశ్నించారు. విపక్ష సభ్యుల అరుపుల నడుమ రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
మరో వైపు కేంద్ర సర్కారు.. సీఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను పెంచనున్నది. సీఐఎస్ఎఫ్ బలగాల సంఖ్యను 2,20,000కు పెంచనున్నారు. దీని కోసం కేంద్ర హోంశాఖ ఆమోదం కూడా తెలిపింది. 2029 నాటికి మరో 70 వేల మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని రిక్రూట్ చేయనున్నారు.
MHA Approves Major CISF Expansion to Boost India’s Economic & Industrial Security
In a significant move to strengthen industrial security and support the nation’s economic growth, the Ministry of Home Affairs (MHA) has approved a substantial increase in the authorized strength… pic.twitter.com/nI6pUkPKTV
— CISF (@CISFHQrs) August 5, 2025