Mahua Maji | హేమంత్ సోరెన్ నేతృత్వంలో నెంబర్ వన్ రాష్ట్రంగా జార్ఖండ్ : మహువ మాఝీ
Mahua Maji : జార్ఖండ్ సీఎంగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ మళ్లీ ప్రమాణ స్వీకారం చేయడం సంతోషకరమని జేఎంఎం ఎంపీ మహువ మాఝీ అన్నారు.
Mahua Maji : జార్ఖండ్ సీఎంగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ మళ్లీ ప్రమాణ స్వీకారం చేయడం సంతోషకరమని జేఎంఎం ఎంపీ మహువ మాఝీ అన్నారు. జేఎంఎం పార్టీ కాదని, ఓ కుటుంబమని, ప్రజల కోసం జేఎంఎం కుటుంబసభ్యులు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఆమె పేర్కొన్నారు. హేమంత్ సోరెన్ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టడంతో రాష్ట్రం, ప్రజా ప్రయోజనాల కోసం ఆయన పాటుపడతారని చెప్పారు.
జార్ఖండ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలనే హేమంత్ ఆకాంక్ష ఇప్పుడు నెరవేరనుందని ఆమె పేర్కొన్నారు. ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ సీవీ రాధాకృష్ణన్ సోరెన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు ఆయనను కూటమి నేతలు లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. చంపై సోరెన్ బుధవారం సీఎం పదవికి రాజీనామా చేశారు.
గవర్నర్‌ను కలిసి ఆయనకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత హేమంత్ సోరెన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. సోరెన్ సీఎంగా ప్రమాణం ప్రమాణం చేయడం ఇది మూడోసారి. కేవలం సోరెన్ మాత్రమే ప్రమాణస్వీకారం చేయగా.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగనున్నది. సీఎం పదవి నుంచి వైదొలిగిన చంపై సోరెన్ ఇకపై కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారనున్నారు. నిన్న జరిగిన జార్ఖండ్ ముక్తి మోర్చా సమావేశంలో శాసనసభాపక్ష నేతగా హేమంత్ సోరెన్‌ను నియమించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్చార్జి గులాం అహ్మద్ మీర్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్, భార్య కల్పనా సోరెన్ సమావేశానికి హాజరయ్యారు.
Read More :
Megastar Chiranjeevi | మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి బిగ్ అప్డేట్.. డబ్బింగ్ షూరు.!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

