Facebook friend captive | ఫేస్బుక్లో పరిచయమైన బాలికను వ్యక్తి నిర్బంధం.. రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడి
Facebook friend captive | ఫేస్బుక్లో పరిచయమైన 11 ఏళ్ల బాలికను ఒక వ్యక్తి నిర్బంధించాడు (Facebook friend captive). సుమారు రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు చివరకు ఆ బాలికను రక్షించారు.
ముంబై: ఫేస్బుక్లో పరిచయమైన 11 ఏళ్ల బాలికను ఒక వ్యక్తి నిర్బంధించాడు (Facebook friend captive). సుమారు రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు చివరకు ఆ బాలికను రక్షించారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఔరద్ షాజనీ ప్రాంతానికి చెందిన మనుద్దీన్ బాదురేకు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 11 ఏళ్ల బాలికతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు గొరఖ్‌పూర్ వచ్చి కొంత కాలం ఉన్నాడు. ఆ బాలికను లోబరుచుకున్నాడు. 2021 డిసెంబర్ 24న ఆమెను లాతూర్‌లోని తన ప్రాంతానికి రప్పించాడు.
కాగా, బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె గదిలోని వస్తువులను తనిఖీ చేయగా రెండు మొబైల్ ఫోన్లు కనిపించాయి. ఒక ఫోన్లోని మొబైల్ నంబర్‌కు కాంటాక్ట్ చేశారు. మాట్లాడిన వ్యక్తి తన పేరు షేక్ అని తెలిపాడు. ఆ బాలిక తన వద్ద ఉన్నదని చెప్పాడు. తిరిగి ఇంటికి రాదని, ఆమె గురించి మరిచిపోవాలని కుటుంబ సభ్యులను హెచ్చరించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు కిడ్నాప్ కేసు నమోదు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఆ బాలిక ఆచూకీ కోసం ఏడాదిన్నర కాలం పాటు ప్రయత్నించారు. ఆమెను బంధించిన వ్యక్తి మహారాష్ట్రలోని లాతూర్‌లో ఉన్నట్లు మొబైల్ నంబర్, సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. దీంతో యూపీ పోలీసులు ఇటీవల ఆ ప్రాంతానికి వెళ్లారు. ఏడాదిన్నరపైగా బాలికను నిర్బంధించిన మనుద్దీన్ను అరెస్ట్ చేశారు. అతడి చెరలో ఉన్న ఆమెను రక్షించారు. వారిద్దరినీ గోరఖ్‌పూర్‌కు తీసుకువచ్చారు. సుమారు రెండేళ్లుగా ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ వ్యక్తి పోలీసులకు చెప్పాడు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

