Maharashtra | కీలక సమావేశాన్ని మళ్లీ రద్దు చేసిన షిండే.. ఢిల్లీకి అజిత్ పవార్
Maharashtra | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనారోగ్యం కారణంగా సోమవారం ముంబైలో జరుగాల్సిన కీలక సమావేశం రద్దైంది. మరోవైపు అజిత్ పవార్ ఢిల్లీ వెళ్లారు.
ముంబై: మహారాష్ట్రలో (Maharashtra) కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అనారోగ్యం కారణంగా సోమవారం ముంబైలో జరుగాల్సిన కీలక సమావేశం రద్దైంది. మరోవైపు అజిత్ పవార్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనాయకులతో సమావేశం కానున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు, పోర్ట్ఫోలియో కేటాయింపులపై వారితో చర్చించనున్నారు.
కాగా, మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు అన్నది ఇంకా తేలలేదు. సీఎం పదవితోపాటు పోర్ట్ఫోలియో కేటాయింపులను ఖరారు చేయడానికి మహాయుతి నేతల సమావేశం సోమవారం జరుగాల్సి ఉంది. అయితే గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్న ఏక్నాథ్ షిండే ముంబైలోని తన అధికారిక నివాసమైన వర్షాకు తిరిగి రాలేదు. ప్రస్తుతం ఆయన సతారా జిల్లాలోని తన స్వగ్రామంలోనే ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో ముఖ్యమంత్రితోపాటు మంత్రి పదవులను ఖరారు చేయడంలో ప్రతిష్టంభన కొనసాగుతున్నది.
మరోవైపు మహాయుతి నేతల మధ్య ఇవాళ ఎలాంటి షెడ్యూల్ లేదని శివసేన వర్గాలు తెలిపాయి. కూటమిలోని ఏకైక పెద్ద పార్టీ అయిన బీజేపీ నిర్వహించే ఈ సమావేశం కోసం తమ పార్టీ ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. మహాయుతి నేతల సమావేశం మంగళవారం జరుగుతుందని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

