Madras High Court | గుళ్లలోకి ఫోన్లు అనుమతించకండి.. డ్రెస్‌కోడ్ తప్పనిసరి చేయండి.. మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు
నవంబర్ 14 నుంచి తిరుచెందూర్ ఆలయంలోకి ఫోన్లను అనుమతించడం లేదు
Madras High Court : మద్రాస్ హైకోర్టు శుక్రవారం సంచలన ఆదేశాలు వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుళ్లలోకి భక్తులు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాలయాల పరిశుద్ధత, పవిత్రతను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అంతేకాదు ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని కూడా తెలిపింది. దాంతో,
ఇప్పటికే తమిళనాడులోని తిరుచెందూర్ ఆలయంలోకి ఫోన్లను అనుమతించడం లేదు. భక్తులతో పాటు ఆలయంలో పనిచేసే సిబ్బంది కూడా గుడిలోపలికి ఫోన్లు తీసుకురావద్దని నోటీసు బోర్డులు పెట్టారు. నవంబర్ 14వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు.
‘భక్తులు, ఆలయ సిబ్బంది ఫోన్లను గుడి బయట డిపాజిట్ చేసేందుకు సెక్యూరిటీ కౌంటర్ ఏర్పాటు చేశాం. టోకెన్లు కూడా ఇస్తున్నాం. సెల్ ఫోన్లు నిషేధం అనే నోటీస్ బోర్డులు పెట్టాం. ఒకవేళ ఎవరిదగ్గరైనా ఫోన్ దొరికితే ఆ ఫోన్‌ను వాళ్లకు తిరిగి ఇవ్వం. అంతేకాదు భక్తులు మనదేశ సంస్కృతికి అద్దంపట్టే దుస్తులు వేసుకోవాలని కోరుతూ గుడి ఆవరణలో నోటీస్ బోర్డులు పెట్టించాం’ అని తిరుచెందూర్ ఆలయ ముఖ్య అధికారి తెలిపాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

