మధ్యప్రదేశ్‌లో డెల్టా ప్లస్ వేరియంట్‌తో కరోనా రోగి మృతి
డెల్టా ప్లస్ వేరియంట్| మధ్యప్రదేశ్‌లో మొదటిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్‌తో కరోనా రోగి మరణం నమోదయ్యింది. ఉజ్జయినిలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగి డెల్టా ప్లస్ వేరియంట్ లక్షణాలతో మృతిచెందినట్లు అధికారులు దృవీకరించారు.

భోపాల్: మధ్యప్రదేశ్‌లో మొదటిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్‌తో కరోనా రోగి మరణం నమోదయ్యింది. ఉజ్జయినిలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగి డెల్టా ప్లస్ వేరియంట్ లక్షణాలతో మృతిచెందినట్లు అధికారులు దృవీకరించారు. రాష్ట్రంలో ఐదుగురికి డెల్టాప్లస్ వైరస్ సోకింది. అందులో నలుగురు కోలుకున్నారని, ఒక మహిళా రోగి మరణించారని ఉజ్జయిని నోడల్ అధికారి చెప్పారు. అందులో ముగ్గురు భోపాల్‌కు చెందినవారుకాగా, మరో ఇద్దరు ఉజ్జయినికి సంబంధించినవారని తెలిపారు. మరణించిన కొవిడ్ రోగి నుంచి తీసిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా అది డెల్టా ప్లస్ వేరియంట్ అని తేలిందన్నారు.
కాగా, సార్ట్ కొవిడ్-2 డెల్టా ప్లస్ వేరియంట్ ప్రబలిన నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి విశ్వస్ సారంగ్ చెప్పారు. డెల్టా ప్లస్ వేరియంట్ రోగుల కాంటాక్టు ట్రేసింగ్ జరుగుతుందన్నారు. ఈ వైరస్ సోకిన ఐదుగురిలో నలుగురు వ్యాక్సిన్ వేయించుకున్నారని, వారంతా కోలుకున్నారని, కానీ టీకా తీసుకోని రోగి మరణించారని వెల్లడించారు. అర్హులైనవారంతా టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

