భోపాల్: పెంపుడు చిలుక కనిపించకుండాపోయింది (Parrot Missing). దాని ఆచూకీ తెలిపిన వారికి బహుమతిగా పది వేలు నగదు ఇస్తానని ఒక వ్యక్తి ప్రకటించాడు. అంతేగాక పోస్టర్లు అంటించడంతోపాటు వాహనాల ద్వారా కూడా ప్రచారం చేయిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దీపక్ సోనీకి చెందిన పెంపుడు చిలుక మంగళవారం నుంచి కనిపించడం లేదు. దీంతో ఆందోళన చెందిన అతడు దాని కోసం వెతకసాగాడు. అలాగే చిలుక ఆచూకీ తెలిపిన వారికి పది వేల క్యాష్ రివార్డు ప్రకటించాడు. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా నగరంలోని పలు చోట్ల అంటించాడు. అలాగే ఆటోలపై మైక్‌లు ఏర్పాటు చేసి తప్పిపోయిన చిలుక గురించి ప్రజలకు తెలియజేస్తున్నాడు.
కాగా, ఆ చిలుకతో తమ కుటుంబానికి రెండేండ్లుగా అనుబంధం ఉందని దీపక్ తెలిపాడు. గత వారం కూడా ఆ చిలుక ఎగిరిపోయిందని, దానికదే తిరిగి వచ్చిందని చెప్పాడు. అయితే ఈసారి మాత్రం ఆ చిలుక జాడ ఎక్కడా కనిపించ లేదన్నాడు. ఆ చిలుక సరిగ్గా ఎగురలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. కుక్క మెరగడంతో భయపడిన అది ఎక్కడో దాగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. చిలుక గురించి సమాచారం తెలిపిన వారికి ప్రకటించిన పది వేల నగదు కంటే ఎక్కువగానే ఇస్తానని మీడియాతో అన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Parrot Goes Missing, Madhya Pradesh Man Offers ₹ 10,000 Cash Reward https://t.co/8aqm25zDM7 pic.twitter.com/AfX5aBFKS7
— NDTV (@ndtv) August 2, 2023