LPG tanker Symi | భారత్‌కు మరో 20 వేల టన్నుల ఇంధనం.. సురక్షితంగా కాండ్లా పోర్టుకు ఎల్పీజీ ట్యాంకర్ సైమీ
LPG tanker Symi | ఎల్పీజీ లోడ్ (LPG load) తో కూడిన ట్యాంకర్ ‘సైమీ (Symi)’ సురక్షితంగా గుజరాత్ (Gujarat) లోని కండ్లా పోర్టుకు చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక దాదాపు 20 వేల టన్నుల ఇంధనాన్ని తీసుకొచ్చింది. పశ్చిమాసియా (West Asia) సంక్షోభం మధ్య మే 13వ తేదీన ఈ నౌక హర్మూజ్ జలసంధిని దాటింది. నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు భారత్‌కు చేరింది.
LPG tanker Symi : ఎల్పీజీ లోడ్ (LPG load) తో కూడిన ట్యాంకర్ ‘సైమీ (Symi)’ సురక్షితంగా గుజరాత్ (Gujarat) లోని కండ్లా పోర్టుకు చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక దాదాపు 20 వేల టన్నుల ఇంధనాన్ని తీసుకొచ్చింది. పశ్చిమాసియా (West Asia) సంక్షోభం మధ్య మే 13వ తేదీన ఈ నౌక హర్మూజ్ జలసంధిని దాటింది. నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు భారత్‌కు చేరింది. నౌకలో మొత్తం 21 మంది సిబ్బంది న్నారు. వారిలో ఎనిమిది మంది ఉక్రేనియన్లు (Ukranians), 13 మంది ఫిలిప్పీన్స్ (Philippines) పౌరులు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో హర్మూజ్ (Hormuz) ను విజయవంతంగా దాటిన 11వ ఎల్పీజీ ట్యాంకర్ (LPG Tanker) గా ‘సైమీ’ని చెప్పవచ్చు.
షిప్పింగ్, విదేశాంగ, రక్షణ, చమురు శాఖల సమన్వయంతో ‘సైమీ’ భారత్‌కు చేరుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలవల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. హర్మూజ్ జలసంధిలో 75 రోజులుగా అంతరాయాల కారణంగా భారత్ ముడిచమురు నిల్వలు గణనీయంగా తగ్గాయి. గడిచిన కొన్ని నెలల్లోనే భారతదేశ చమురు నిల్వలు దాదాపు 15 శాతం మేర పడిపోయాయి. ఫిబ్రవరి చివరలో ఈ సంక్షోభం ప్రారంభమైనప్పుడు చమురు నిల్వలు 107 మిలియన్ బ్యారెల్స్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నిల్వలు 91 మిలియన్ బ్యారెల్స్‌కు పడిపోయాయని ఇంధన విశ్లేషణ సంస్థ కెప్లర్ తెలిపింది.
కాగా, దిగుమతులు తగ్గినప్పటికీ భారతీయ రిఫైనరీలు తమ కార్యకలాపాలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ప్రాసెసింగ్ పనుల్లో ఇప్పటివరకు ఎలాంటి కోతలు విధించకుండా స్థిరంగా నడిపిస్తున్నాయి. అయితే సరఫరాలో అంతరాయాలు కొనసాగితే రిఫైనరీల నిర్వహణ భారంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ముడిచమురు ప్రాసెసింగ్ స్థాయులను తగ్గించుకోవడం మినహా వేరే మార్గం ఉండదని విశ్లేషకులు అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

