ఉలిక్కిపడిన బెంగళూరు.. పలు ప్రాంతాల్లో భారీ శబ్దం
భారీ శబ్దం | కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు భారీ శబ్దం వినిపించింది. భారీ శబ్దంతో బెంగళూరు

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు భారీ శబ్దం వినిపించింది. భారీ శబ్దంతో బెంగళూరు వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దం ధాటికి పలు నివాసాల్లో కిటికీలు కొట్టుకున్నాయి. ఈ శబ్దానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బెంగళూరు వాసుల ట్వీట్ ప్రకారం.. షార్జాపూర్ ఏరియా, జేపీ నగర్, బెన్సన్ టౌన్, ఉల్సూరు, ఇస్రో లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లే అవుట్, సౌత్ బెంగళూరు, ఈస్ట్ బెంగళూరులో భారీ శబ్దం వినిపించినట్లు పేర్కొన్నారు.
శబ్దం ధాటికి కిటికీలు కొట్టుకున్నాయి. అసలేం జరిగింది. ఇది మరొక సోనిక్ బూమ్? అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఈ శబ్దంపై హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్పందిస్తూ.. తమ విమానాలు ఇలాంటి శబ్దాలు చేయలేదని స్పష్టం చేశారు.
సోనిక్ బూమ్ అంటే?
అయితే బెంగళూరులోని పలు ప్రాంతాల్లో భారీ శబ్దం వినిపించడంపై సోనిక్ బూమ్ అని ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ఈ శబ్దానికి సోనిక్ బూమ్ కారణమని పోలీసులు కానీ, వైమానిక దళం కానీ ధృవీకరించలేదు. అసలు సోనిక్ బూమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎయిర్ క్రాఫ్ట్ లు వేగంగా వెళ్లినప్పుడు వచ్చే ఫలితమే సోనిక్ బూమ్. ఒక విమానం ధ్వని వేగం కంటే వేగంగా కదిలినప్పుడు వాతావరణంలో షాక్ తరంగాలు సృష్టించబడినప్పుడు సోనిక్ బూమ్ ఏర్పడుతుంది. ధ్వని గాలిలో సెకనుకు 343 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
గతేడాది బెంగళూరులో సోనిక్ బూమ్
గతేడాది మే నెలలో బెంగళూరులో సోనిక్ బూమ్ శబ్దం వినిపించింది. అయితే అప్పుడు అందరూ దాన్ని ఉరుముగా అభిప్రాయపడ్డారు. ఆ టైమ్‌లో శబ్దం ధాటికి కిటికీలు కొట్టుకున్నాయి. స్వల్ప ప్రకంపనలు కూడా సంభవించాయి. అయితే ఆ శబ్దాలు.. సుఖోయ్ 30 యుద్ధ విమానం వల్ల వచ్చాయని, దీన్ని భారత వైమానిక దళం కూడా ధృవీకరించిందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

