Lok Sabha | డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్సభ ఆమోదం
Lok Sabha | భారతదేశ పౌరుల వ్యక్తిగత డాటా రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు - 2023’ కు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
న్యూఢిల్లీ: భారతదేశ పౌరుల వ్యక్తిగత డాటా రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు – 2023’ కు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సభ్యుల మూజువాణి ఓటుతో బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
విపక్ష ఎంపీల ఆందోళనల నడుమే కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం, ఆ బిల్లు సభ ఆమోదం పొందడం వెంటవెంటనే జరిగిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు దేశ పౌరుల డాటాను ఎలా వినియోగించుకోవాలి, ఎలా వినియోగించకూడదు..? అనే వివరాలను ఈ బిల్లులో పొందుపర్చారు.
అయితే, లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇక రాజ్యసభ ఆమోదం కూడా పొందితే చట్ట రూపం దాలుస్తుంది. కాబట్టి ఆమోదం కోసం బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ లేనందున.. విపక్ష ఎంపీల్లో కూడా కొందరు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే ఈ బిల్లు చట్టరూపం దాల్చే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

