Parliament: అదానీపై జేపీసీ వేయాలి.. రాహుల్ క్షమాపణలు చెప్పాలి
Parliament:పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇవాళ కూడా రెండు సభలు ఏ చర్చ నిర్వహించకుండా వాయిదా పడ్డాయి. అదానీ సంక్షోభంపై జేపీసీతో దర్యాప్తు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తోంది.
న్యూఢిల్లీ: అదానీ సంక్షోభం(Adani Issue).. రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శలే.. పార్లమెంట్(Parliament) రెండో దఫా సమావేశాలను మింగేస్తున్నాయి. విపక్ష, అధికార సభ్యులు ఆందోళనలతో .. ఉభయసభల్లోనూ చర్చలు లేకుండాపోతున్నాయి. ఇవాళ కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో మళ్లీ అదే సీన్ రిపీటైంది. అదానీ-హిండెన్‌బర్గ్ రిపోర్టు ఆధారంగా జేపీసీ(JPC) వేయాలని బీఆర్ఎస్(BRS)తో పాటు ఇతర విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభలో, రాజ్యసభలో ఈ అంశాన్ని చర్చించాలని విపక్షాలు పట్టుపట్టాయి. కానీ ప్రభుత్వం మాత్రం తగ్గడం లేదు. దీంతో రెండు సభల్లోనూ గందరగోళం(Chaos) నెలకొన్నది. రెండు సభలను సోమవారానికి వాయిదా వేశారు.
ఇక అధికార పక్షం(Ruling Party) రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. లండన్ వర్సిటీలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపడుతోంది. దేశంలో ప్రజాస్వామ్యం(Democracy) లేదని రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే. అదానీ అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ వ్యాఖ్యలను సాకుగా వాడుకుంటుందని కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆరోపిస్తోంది. రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే అని రూలింగ్ పార్టీ భీష్మించడంతో సభ జరగలేదు.
ఇవాళ ఉదయం లోక్‌సభ(Loksabha)లో కాసేపు ప్రశ్నోత్తరాల సమయం నడిచింది. స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla) సభను నడిపంచే ప్రయత్నం చేశారు. కానీ విపక్షాలు నినాదాలను ఆపలేదు. దీంతో స్పీకర్ బిర్లా సభను సోమవారానికి వాయిదా వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

