Drone Crash | కర్ణాటకలో కుప్పకూలిన DRDO డ్రోన్.. ఆందోళనకు గురైన స్థానికులు
Drone Crash | భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగానికి (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌కు) సంబంధించిన డ్రోన్ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్-UAV) ఒకటి ఆదివారం ఉదయం కుప్పకూలింది.
బెంగళూరు: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగానికి (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌కు) సంబంధించిన డ్రోన్ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్-UAV) ఒకటి ఆదివారం ఉదయం కుప్పకూలింది. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రోన్‌పై TAPAS-07A-14 నంబర్ ఉంది.
ఒక్కసారిగా పంట పొలాల్లో డ్రోన్ కుప్పకూలడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, డీఆర్డీవో అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనలో డ్రోన్ పూర్తిగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.
#WATCH | A Tapas drone being developed by the DRDO crashed today during a trial flight in a village of Chitradurga district, Karnataka. DRDO is briefing the Defence Ministry about the mishap and an inquiry is being carried out into the specific reasons behind the crash: Defence… pic.twitter.com/5YSfJHPxTw
— ANI (@ANI) August 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

