తిమింగళం కక్కిన పదార్థానికి రూ.10 కోట్లట..!
Whale vomit: అంబర్‌గ్రీస్‌గా పిలిచే ఈ తిమింగలం వాంతి దొరికితే ఎవరైనా కోటీశ్వరులు అయిపోయినట్టేనట.

యెమెన్: వాంతి..! మన వాడుక భాషలో దీన్ని కక్కు అంటాం..! కొందరికి ఈ పదం వింటేనే కడుపులో మెలిపెట్టినట్టు అవుతుంది. ఇక చూస్తేనా ఆ అవస్థను చెప్పతరం కాదు..! ఇంతటి వికారం పుట్టించే వాంతికి కూడా ఎంతో విలువ ఉన్నదని మీకు తెలుసా..? కాకపోతే అది మనిషి వాంతి కాదు. తిమింగళం వాంతి. అంబర్‌గ్రీస్‌గా పిలిచే ఈ తిమింగలం వాంతి దొరికితే ఎవరైనా కోటీశ్వరులు అయిపోయినట్టేనట. తాజాగా యెమెన్ దేశంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లకు రూ.10 కోట్ల విలువ చేసే అంబర్‌గ్రీస్ దొరికిందట.
వివరాల్లోకి వెళ్తే.. యెమెన్‌కు చెందిన 35 మంది జాలర్లు కలిసి ఒకేసారి సముద్రంలో వేటకు వెళ్లారట. వారికి సముద్రం నీటిలో తేలుతున్న ఒక విచిత్ర వస్తువు కనిపించిందట. తీరా దాని దగ్గరకు వెళ్లి చూస్తే అది స్పెర్మ్ వేల్ వాంతి అని తెలిసిందట. అది చాలా విలువైనది అని పసిగట్టిన జాలర్లు దాన్ని తీసుకొచ్చి మార్కెట్లో విక్రయించగా రూ.10 కోట్లు వచ్చాయట. ఈ సొమ్మును తాము తలా కొంత పంచుకుని, మిగిలినది నిరుపేద జాలర్లకు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. అసలు తిమింగళం వాంతికి ఎందుకు ఇంత డిమాండ్ అనేది ఆసక్తి రేపుతున్న విషయం. అయితే, అంబర్‌గ్రీస్‌గా పిలిచే ఈ స్పెర్మ్ వేల్ వాంతిని సుగంధ పరిశ్రమలు అతి విలువైన ఖజానాగా పరిగణిస్తాయట. ఇది దొరకడం చాలా అరుదు కాబట్టి ధర ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేస్తారట. అన్ని వాంతుల లాగే ఈ వాంతి కూడా ఫ్రెష్‌గా ఉన్నప్పుడు కంపు వాసన కొడుతుందట. కానీ, ఓసారి గట్టిపడిందటే సువాసన వెదజల్లుతుందట.
అందుకే ఈ అంబర్‌గ్రీస్ పెర్ఫ్యూమ్ వాసను రెట్టింపుచేయడంతో పాటు దీర్ఘకాలం కొనసాగేలా చేస్తుందట. ఇది తిమింగళాల జీర్ణకోశంలో తయారవుతుందట. అవి వాంతి చేసుకున్నప్పుడు నీళ్లపై పడి గట్టిపడుతుందట. అనంతరం అది నీటిలో తేలియాడుతూ తీరానికి కొట్టుకొస్తుందట.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

