CM Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కోర్టుకు ఈడీ..! రేపు విచారణ..!
CM Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది. ఈ అంశంపై గురువారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నది.
CM Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది. ఈ అంశంపై గురువారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నది. గతంలోనూ ఈడీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటి వరకు ఈడీ ఎనిమిది సార్లు సమన్లు పంపగా.. విచారణకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించగా.. గురువారం విచారణ కోసం ఏసీఎంఎం దివ్య మల్హోతా జాబితా చేశారు. అయితే, మూడుసార్లు నోటీసులు జారీ చేసినా హాజరుకాకపోవడంతో ఈడీ స్థానిక కోర్టును ఆశ్రయించింది.
ఈ కేసులో మార్చి 16న విచారణ జరుగనున్నది. ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణంలో విచారణకు కేజ్రీవాల్ అంగీకరించారు. మార్చి 12 తర్వాత కొత్త తేదిని ఇవ్వాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్నట్లు తెలిపారు. మద్యం పాలసీ కేసులో గతేడాది నవంబర్ 2 నుంచి ఇప్పటి వరకు ఈడీ ఎనిమిదిసార్లు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీ కింద లైసెన్స్‌ల జారీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఎల్జీ వీకే సక్సేనా మద్యం పాలసీని రద్దు చేసి.. సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. ఇందులో ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్.. షూటింగ్ పూర్తి, త్వరలోనే రాజమౌళి భారీ సర్ప్రైజ్!
Motivational Story | పొలంలో ముల్లు గుచ్చుకుంటే ఆగలేదు.. అడవిలో పాములను చూసి ఎందుకు భయపడ్డాడు?.
Ant Story | ఓ చిన్న చీమ చెప్పిన గొప్ప జీవిత పాఠం.. ఖురాన్లో ప్రస్తావించిన అద్భుత కథ
Karthika Masam | కార్తిక మాసాన్ని హరిహర మాసం అని ఎందుకంటారు? దీపారాధన నుంచి తులసీ పూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఉన్న రహస్యం ఇదే!
Bigg Boss 10 | హైపర్ ఆది పంచులతో హౌస్‌లో నవ్వుల సందడి.. శ్వేత ఎలిమినేట్,అమన్ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

