మూడు లారీల్లో.. బీజూ పట్నాయక్ విమానం తరలింపు
బీజూ పట్నాయక్ వినియోగించిన డకోటా విమానం శిథిలావస్థకు చేరి కోల్‌కతాలోని నేతాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దశాబ్ధాలుగా పడి ఉంది.
భువనేశ్వర్: ఒడిశా మాజీ సీఎం బీజూ పట్నాయక్ వినియోగించిన డకోటా విమానాన్ని మూడు లారీల్లో తరలించారు. ప్రస్తుత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తండ్రి అయిన బీజూ పట్నాయక్, బ్రిటీష్ పాలనలోని రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్. కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా కళింగ ఎయిర్‌లైన్స్‌ను కూడా స్థాపించారు. స్వాతంత్ర సమరయోధులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రహస్యంగా ఆయన తరలించారు. 1947 ఏప్రిల్‌లో అప్పటి ఇండోనేషియా ప్రధాని సుతాన్ సజహ్రీర్ను రక్షించేందుకు డకోటా విమానాన్ని ఉపయోగించారు. దీనికి గాను ఇండోనేషియా ప్రభుత్వం కృతజ్ఞతగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భూమిపుత్ర’తో బీజూ పట్నాయక్‌ను రెండు సార్లు సత్కరించింది.
కాగా, బీజూ పట్నాయక్ వినియోగించిన డకోటా విమానం శిథిలావస్థకు చేరి కోల్‌కతాలోని నేతాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దశాబ్ధాలుగా పడి ఉంది. దీనిని ఒడిశాకు తరలించేందుకు సీఎం నవీన్ పట్నాయక్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అయితే 2020లో జరుగాల్సిన ఈ పాత విమానం తరలింపు కరోనా కారణంగా ఆలస్యమైంది.

మరోవైపు బీజూ పట్నాయక్ వినియోగించిన డకోటా విమానాన్ని చివరకు పలు భాగాలుగా విడదీసి మూడు లారీల్లో కోల్‌కతా విమానాశ్రయం నుంచి ఒడిశాకు తరలించారు. మార్గమధ్యలో దీనిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో ఆ లారీల వద్దకు వచ్చారు. భువనేశ్వర్‌లోని బీజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానాన్ని ఉంచుతారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) దీని కోసం 1.1 ఎకరాల భూమి కేటాయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

