హిమాచల్లో విరిగిపడ్డ కొండచరియలు.. శిథిలాల కింద బస్సు, ట్రక్కు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ రోడ్డుపై వాహనాలు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ కొండరాళ్ల మధ్య ట్రక్కు, బస్సు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రిక్కాంగ్ పియో-షిమ్లా జాతీయ రహదారిపై ఉన్న కిన్నౌర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇవాళ మధ్యాహ్నం 12.45 నిమిషాలకు కొండచరియలు విరిగిపడినట్లు ఐటీబీపీ తెలిపింది. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల.. హిమాచల్ ప్రదేశ్లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇవాళ్టి ఘటనలో ఎంత మంది మృతిచెందారో ఇంకా తెలియలేదు. శిథిలాల కింద ఓ ట్రక్కు, బస్సుతో పాటు ఇతర వాహనాలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండో-టిబెట్ బోర్డర్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
A landslide reported on Reckong Peo- Shimla Highway in #Kinnaur District in Himachal Pradesh today at around 12.45 Hrs. One truck, a HRTC Bus and few vehicles reported came under the rubble. Many people reported trapped. ITBP teams rushed for rescue. More details awaited. pic.twitter.com/ThLYsL2cZK
— ITBP (@ITBP_official) August 11, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

