‘జీవన నైపుణ్యాలు’ తెలిసింది 40 శాతానికే
ఆధునిక ప్రపంచంలో సక్సెస్ కావాలంటే కొన్ని శక్తి, సామర్థ్యాలు, సమర్థతలు అవసరం. వీటినే జీవన నైపుణ్యాలు లేదా 21వ శతాబ్దపు నైపుణ్యాలు అంటారు.
- భారత యువతలో నైపుణ్యాల నిర్వచనంపై కొరవడిన స్పష్టత
- ది వాయిసెస్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: ఆధునిక ప్రపంచంలో సక్సెస్ కావాలంటే కొన్ని శక్తి, సామర్థ్యాలు, సమర్థతలు అవసరం. వీటినే జీవన నైపుణ్యాలు లేదా 21వ శతాబ్దపు నైపుణ్యాలు అంటారు. వీటి గురించి విన్న భారత యువత, బాలలు సుమారు 40 శాతం మంది మాత్రమేనని ‘ది వాయిసెస్ సర్వే’ అధ్యయనంలో వెల్లడైంది. వీటి గురించి విన్నవారిలో 14 నుంచి 18 సంవత్సరాల వయసు గలవారి కన్నా 19 నుంచి 22 సంవత్సరాల వయసు గలవారు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. 11 జిల్లాల్లోని 15,856 మంది యువత, 13,806 మంది తల్లిదండ్రులు, 2,366 మంది స్కూల్ టీచర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు.
21వ శతాబ్దపు నైపుణ్యాలు అంటే విమర్శనాత్మకంగా ఆలోచించడం, సృజనాత్మకత, డిజిటల్ లిటరసీ, సాంస్కృతిక అవగాహన వంటివి. ఇవి సంప్రదాయ విద్యా సంబంధిత విజ్ఞానానికి భిన్నమైనవి. ఆధునిక ప్రపంచంలో జీవనం, విద్యాభ్యాసం, ఉద్యోగం, వ్యక్తిగత వికాసం వంటి వాటిలో విజయానికి ఇవి అవసరం.
వీటి గురించి విన్నవారు ఎవరంటే…
ఉన్నత విద్యాభ్యాసం చేసినవారు, ఫోన్లను వాడగలిగేవారు, తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులైనపుడు యువత జీవన నైపుణ్యాల గురించి వినే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ విషయంలో స్త్రీ, పురుషుల్లో కొద్దిగా తేడా ఉన్నది. ఈ నైపుణ్యాల గురించి తెలుసునని చెప్పినవారు సైతం పొరబడుతున్నారు. వృత్తి విద్యా నైపుణ్యాలు, ఇతర రోజువారీ నైపుణ్యాలే 21వ శతాబ్దపు నైపుణ్యాలని భావిస్తున్నారు.
ఇతరులతో సంబంధాల నిర్వహణ, ఒత్తిడిని తట్టుకోగలగడం వంటివి జీవన నైపుణ్యాలని 90% మంది యువత చెప్పారు. వంట చేయడం, సైక్లింగ్ వంటివి జీవన నైపుణ్యాలని 80% మంది అభిప్రాయపడ్డారు. సమస్యను పరిష్కరించగలగడం, నిర్ణయాలు తీసుకోగలగడం గురించి తెలుసునని చెప్పినవారు 70 శాతం మంది కన్నా ఎక్కువగా ఉన్నారు. క్రిటికల్ థింకింగ్, తట్టుకోగలగడం గురించి అడిగినపుడు అత్యధికులు ఇబ్బందిపడ్డారు.
ఎక్కడ తెలుసుకుంటారు?
ఈ నైపుణ్యాల గురించి తెలుసునని చెప్పిన యువతలో 65 శాతం మంది టీచర్లపై ఆధారపడ్డారని, 36% మంది పాఠశాల పుస్తకాలపై ఆధారపడ్డారని వెల్లడైంది. విద్యా సంస్థల్లో ఈ నైపుణ్యాలను నేర్చుకోవచ్చునని 86% మంది యువత, 75% మంది తల్లిదండ్రులు చెప్పారు.
టీచర్ల సంగతేమిటి?
జీవన నైపుణ్యాల పదాలను విన్నామని 90 శాతానికి పైగా టీచర్లు చెప్పారు. లైఫ్ స్కిల్స్ పరిధిలోకి వచ్చే నైపుణ్యాలేమిటో టీచర్లకు స్పష్టత లేదని అధ్యయనంలో వెల్లడైంది. లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, నైతిక విద్య ఒకటేనని 60 శాతం మంది టీచర్లు నమ్ముతున్నారని తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

