కోవిడ్‌పై పోరాటానికి కుంభమేళా ఓ ప్రతీకగా నిలవాలి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళా ఇక ముగిసే అవకాశాలు ఉన్నాయి. కుంభమేళాపై ప్రధాని మోదీ ఇవాళ తన ట్విట్టర్లో స్పందించారు. కుంభమేళా మహా వేడుకను ఇక ఒక సంకేతంగా మాత్రమే చూడాలన్నారు. కరోనా సంక్షోభ వేళ కుంభమేళాను నిలిపివేయడం ఉత్తమం అన్న అభిప్రాయాన్ని ఆయన వినిపించారు. భక్తుల రద్దీ లేకుండా చూడాలన్నారు. నిరంజనీ అకారా సాధువుల క్షేమ సమాచారం తెలుసుకున్నట్లు మోదీ చెప్పారు. హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో సాధువులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రోజున సుమారు 30 మంది సాధువులు కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. నిరంజనీ అకారా అధ్యక్షుడు స్వామి అవదేశానంద గిరి జీ మహారాజ్‌తో ఫోన్లో మాట్లాడారు. సాధువుల ఆరోగ్యం కోసం అన్ని రకాల సహాకారాలు అందించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఇప్పటి వరకు కుంభమేళాలో సాధువులు రెండుసార్లు పుణ్య స్నానాలు చేశారని, ఇక కుంభమేళాలో జరిగే క్రతువులను ఒక ప్రతీకగా మాత్రమే ఉంచుదామని, దీని వల్ల కరోనా సంక్షోభంపై పోరాడేందుకు బలం వస్తుందని ప్రధాని తెలిపారు. నిరంజనీ అకారా కార్యదర్శి మహంత్ రవీంద్ర పురి కోవిడ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. నిరంజనీ అకారా చీఫ్ నరేంద్ర గిరి కూడా కోవిడ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. ఆయన్ను రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో అడ్మిట్ చేశారు.
मैंने प्रार्थना की है कि दो शाही स्नान हो चुके हैं और अब कुंभ को कोरोना के संकट के चलते प्रतीकात्मक ही रखा जाए। इससे इस संकट से लड़ाई को एक ताकत मिलेगी। @AvdheshanandG
— Narendra Modi (@narendramodi) April 17, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

