రాజకీయాల్లో సరికొత్త విప్లవం.. టీవీకే అధినేత విజయ్ గెలుపుపై కేటీఆర్
టీవీకే అధినేత విజయ్ సమకాలిన రాజకీయాల్లో సరికొత్త విప్లవం సృష్టించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు.
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): టీవీకే అధినేత విజయ్ సమకాలిన రాజకీయాల్లో సరికొత్త విప్లవం సృష్టించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయం సాధించిన సందర్భంగా సోమవారం ఎక్స్ వేదికగా విజయ్‌కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే తమిళనాడు రాజకీయాల్లో విజయ్ అద్భుతమైన అరంగేట్రం చేశారని కొనియాడారు. సంప్రదాయాలు, మూస పద్ధతులను బద్ధలుకొట్టారని పేర్కొన్నారు. మీ నాయకత్వంలో తమిళనాడు మరింతగా అభివృద్ధి చెంది బలంగా ఎదగాలని ఆకాంక్షించారు.
తొలిసారే గొప్ప ఫలితం: హరీశ్‌రావు
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్‌కు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. తొలిసారి రాజకీయాల్లో ప్రవేశించి గొప్పగా ఫలితాలు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజాతీర్పు స్ఫూర్తితో తమిళ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- harish rao
- KCR
- KTR
- Vijay Thalapathy
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

